ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికపై సవతి తండ్రి అఘాయిత్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 12:29 PM

తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. తండ్రి స్థానంలో ఉండాల్సిన ఆ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.


ఏపీలోని కడప జిల్లా పులివెందుల మహిళకు 8వ తరగతి చదివే కుమార్తె ఉంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె నగరిగుట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఓ వైపు తల్లితో సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమె కుమార్తెను కూడా లొంగదీసుకోవాలని భావించాడు. బాలిక తల్లి లేని సమయం చూసి ఇటీవల ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని చైల్డ్ లైన్ సంస్థకు ఫోన్ చేసి చెప్పింది. 


చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ జోసఫ్‌ అక్కడకు చేరుకుని బాధిత బాలిక నుంచి వివరాలు సేకరించాడు. వెంటనే నిందితుడిపై పోలీసులకు ఆయన సమాచారమిచ్చారు. పోలీసుల విచారణలో నిందితుడు అత్యాచారం చేసిన విషయాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com