ఆదోని పట్టణం లోని 24వ వార్డు క్రాంతినగర్‌లో బహిర్భూమికి వెళ్లే ఆడవారిపై దున్నపోతు విరుచుకుపడిన ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు అమీలియో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య మంగమ్మ కొట్టుమిట్టాడుతుంది. పరిసరా ప్రాంతంలో ఉన్న దున్నపోతులను వేరే చోటికి మార్చాలని కోరుతున్నారు. శునకాల దాడులైపోయాయి, వరాహా దాడులైపోయాయి, దున్నపోతుల దాడులు మొదలయ్యాయని మహిళలు వాపోతున్నారు. అధికారుల స్పందించి దున్నపోతు దాడుల నుంచి రక్షించాలని కోరుతున్నారు.