మన దేశం భిన్నత్వం లో ఏకత్వం అనే నినాదంతో నడుస్తుంది. అలానే దేవుళ్ళు ఎంతమంది ఉన్న అందరూ ఒక్కటే అని నమ్మే మనసత్త్వం కలిగి ఉంటాం. ఐతే ముస్లిం లకు పండగ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదే రంజాన్. దాదాపుగా 30 రోజులుగా వీరు ఉపవాసం ఉండటమే కాకుండా ఈ దినాలలో పవిత్రతను కలిగి ప్రత్యేక ప్రార్ధనలు చెయ్యడం మనం గమనించవచ్చు. అలానే, ఇలా చెయ్యడం వలన దేవుడు వీరి యందు దయ చూపి పాపాలను క్షమించి, దీవెనలు ఇస్తారు అనేది వీరి నమ్మకం. కుల మతాలకి అతీతంగా రంజాన్ మన దేశంలో అన్ని చోట్ల జరుపుకుంటారు , ఐతే ఈ సందర్భంగా నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ... ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమైనది. కావున నరసరావుపేట నియోజకవర్గ ముస్లిం సోదరలు అందరూ హాజరు కావలసిందిగా ప్రార్థన అని పిలుపునిచ్చారు.
స్థలం:-
28-04-2022,గురువారం,సాయంత్రం,
బత్తిని గార్డెన్,ఎస్.ఆర్.కె.టి కాలనీ, నరసరావుపేట.