భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ అరుణ్ లాల్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన వయసు 66 సంవత్సరాలు. తనకంటే 28 ఏళ్లు చిన్నతైన తన స్నేహితురాలు బుల్ బుల్ సాహాను మే 2, 2022న పెళ్లాడనున్నాడు. ఆమె వయసు 38 ఏళ్లు. సన్నిహితుల మధ్య కోల్‌కతాలో వారి పెళ్లి వేడుక జరగనుంది. ఇటీవలే వారి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇప్పటికే అరుణ్‌లాల్‌కు పెళ్లైంది. ఆమె భార్య రీనాకు అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం అయింది. వారిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ ఒకే ఇంట్లో ఉంటారు. ఇక రీనాకు బుల్ బుల్ సాహా ముందు నుంచే పరిచయం ఉంది. దీంతో ఆమెతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పెళ్లికి రీనా నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఎదురవలేదు. మరోవైపు రీనాను పెళ్లైన తర్వాత జాగ్రత్తగా చూసుకుంటానని బుల్ బుల్ చెబుతోంది.
ఇక బెంగాల్ కోచ్‌గా ఉన్న అరుణ్ లాల్ నేతృత్వంలో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2020లో రంజీ ట్రోఫీ ఫైనల్‌కు బెంగాల్ జట్టు చేరుకుంది. 1989-90లో బెంగాల్ రంజీ ట్రోఫీ విజయం సాధించడంలో ఆటగాడిగా అరుణ్ లాల్ కీలక పాత్ర పోషించాడు. ఇక నాలుగేళ్ల క్రితం 'అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా' అనే అరుదైన రకం లాలాజల గ్రంధుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే అతను కేన్సర్ వ్యాధిని అధిగమించి కోచ్‌గా వెళ్లాడు. లాల్ 1982-1989 మధ్య 16 టెస్ట్ మ్యాచ్‌లు , 13 వన్డేలలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.