మహిళల భద్రతకు దిశ యాప్ ను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి తీసుకువచ్చారని దిశ యాప్ ను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని స్వయంకృషి సేవాసంస్థ అద్యక్షులు ఎస్ కె నాయబ్ రసూల్ అన్నారు. పామూరు మండలం చింతపూడి సచివాలయంలో మహిళా పోలీస్ గా పనిచేస్తున్న హరిత దిశ యాప్ ని ఎక్కువ మంది మహిళల చేత డౌన్ లోడ్ చేపించి ఉత్తమ మహిళా పోలీస్ అవార్డ్ ను ప్రకాశం జిల్లా ఎస్ పి మల్లికా గార్గ్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పామురు స్వయంకృషి సేవాసంస్థ కార్యాలయంలో సంస్థ అద్యక్షులు ఎస్ కె నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో జి హరితను సన్మానంచేసినారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ లు శ్రీదేవి, గాయత్రి, అనూష, సంస్థ సభ్యులు వేల్పుల నారాయణ యాదవ్, సయ్యద్ జిలాని, ప్రభాకర్‌రెడ్డి, భూసరాజు హరీష్ తదితరులు పాల్గొన్నారు.