నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహిస్తూ నాటు సారా తయారీదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణాజిల్లా గూడూరు పోలీసులు. జిల్లాలో ఎక్కడా నాటుసారా ఆనవాళ్లు కనబడ కూడదని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం దాడులు నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు బందరు డిఎస్పీ మాసూం భాషా పర్యవేక్షణలో కృష్ణాజిల్లా గూడూరు పోలీస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా గురువారం నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లవోలు గరువు గ్రామంలో రహస్యంగా, ఎవ్వరికీ అనుమానం రాకుండా నాటు సారా తయారు చేయుటకు సిద్ధంగా ఉంచిన 1000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 25 లీటర్ల నాటుసారాను, బట్టి సామాను స్వాధీనం చేసుకొని 04 వ్యక్తులను అదుపులోకి తీసుకొని, కేసులు నమోదు చేసినారు. ఈ సందర్భంగా బందర్ డి. యస్. పి. షేక్ మాసూం బాషా మాట్లాడుతూ, ఎవరైనా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.