పెంచిన ఛార్జీలు తగ్గించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కడప నగరంలోని ఓం శాంతి నగర్ లో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గ బాధ్యుడు అమీర్ బాబు, నగర అధ్యక్షుడు శివ కొండారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ప్రజల నుంచి ఓట్లు వేయించుకున్న సీఎం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల చార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడేలా చూస్తున్నారని ఆరోపించారు.