పల్నాడు జిల్లా , నరసరావుపేట లో టీడీపీ పార్టీ, తెలుగు మహిళ ఆధ్వర్యంలో మహిళలు పార్టీ ఇంచార్జి అరవింద్ బాబు తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం జరిగింది. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది అన్నారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ... వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళల పై జరుగుతున్న దాడుల నేరాల్లో దేశంలోనే ఆంద్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళల పై జరుగుతున్న దాడులకు నిరసనగా 21 రోజుల్లో హత్యకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలియచేసారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు వెలికి చూస్తూనే ఉన్నాం, బయట ప్రపంచానికి తెలిసినవే ఇన్ని ఉంటె, మరుగున పడి ఇంకా ఎన్ని అన్యాయాలు దాగి ఉండి ఉంటాయో అని భాధను వ్యక్త పరిచారు.