చిన్నారులకు దగ్గు తగ్గాలంటే వైద్య నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
- దగ్గుతో బాధ పడుతున్న పిల్లలకు ఎక్కువగా ద్రవ పదార్థాలు ఇవ్వాలి. తేలికపాటి ఆహరం ఇవ్వడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది.
- ఆవిరి పట్టడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
- వత్తిలాగా చేసిన దూదితో ముక్కును శుభ్రం చేయాలి. అలా చేయడం వల్ల గాలి పీల్చడం తేలికవుతుంది. మంచి నిద్ర పడుతుంది.
- పిల్లలను పడుకోబెట్టినప్పుడు తలకింద చిన్న దిండు పెడితే శ్వాస బాగా ఆడుతుంది.
- నోట్లో వేళ్లు పెట్టి శ్లేష్మాన్ని తీయడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల ఒక్కోసారి శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది.
- పెద్ద పిల్లలు దగ్గినప్పుడు ముక్కుకు రుమాలు అడ్డు పెట్టుకోవడం నేర్పించాలి. ముక్కును తడిమినప్పుడల్లా చేతులను శుభ్రం చేసుకోమని చెప్పాలి.
- పెద్ద పిల్లలైతే గొంతునొప్పి ఉన్నప్పుడు ఉప్పునీటితో నోరు పుక్కిలించి, ఉమ్మి వేయమని చెప్పాలి. గోరు వెచ్చని నీరు తాగించడం వల్ల గొంతునొప్పి త్వరగా తగ్గుతుంది.