పులివెందుల పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఇటీవలే ఆ బాలిక తండ్రి మృతి చెందడంతో ఆ బాలిక తల్లి మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వరుసకు తండ్రిలాంటి ఆ వ్యక్తి రాక్షసుడుగా మారి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. భయంతో ఆ బాలిక రైడ్స్ చైల్డ్ లైన్1098కు జరిగిన అత్యాచారం గురించి సమాచారం అందించింది. పులివెందుల సీఐ భాస్కర్ రెడ్డి విచారణ చేయగా ఆ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. పులివెందుల పోలీసులు ఆ బాలికను వైద్య పరీక్ష కోసం కడప రిమ్స్ కు పంపించడం జరిగింది. అతనిని అరెస్టు చేసి పోక్ట్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.