ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలి పాముకాటుకు గురయ్యాడు. ఈ సంఘటన నారాయణవనం మండలంలో చోటుచేసుకుంది. భీమునిచెరువు కు చెందిన ఉపాధి కూలీ రోహిణి కాశింమిట్ట ఎస్టీకాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా పాము కాటు కు గురయింది. తోటి కూలీలు ఆమెను వెంటనే నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.