రాజాం పట్టణము లో కుక్కలు సంతతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా అధికంగా శునకాలు గుంపులు గుంపులు గా కనబడుతున్నాయి. దీంతో ఈ దారిగుండా వెళ్లడానికి వాహనదారులు పాదచారులు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా నడిచి వెళ్లే వారిపై కొన్ని కుక్కలు దాడి చేస్తుండగా, మోటార్ సైకిల్ పై వెళ్లే వారిపై కూడా వెంబడించి మరి ఎటాక్ చేస్తుండడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఏ వీధిలో చూసినా ఇబ్బడి ముబ్బడిగా శునకాలు దర్శనం ఇస్తుండటంతో రాజాం ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రాజాం మునిసిపల్ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బి ఏళ్ల తరబడి రాజాం మున్సిపాలిటీలో కుక్కలకు గర్భ నిరోధక ఆపరేషన్లు చేయక పోవడంతో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇప్పటికైనా రాజాం మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలకు ఆపరేషన్లు చేయించి తద్వారా వాటి సంతతి నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.