శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు దానిమ్మ పండ్లలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ దానిమ్మ పండ్ల రసం తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. చర్మ ఆరోగ్యానికి దానిమ్మ ఎంతో మేలు చేస్తుంది. నిగనిగలాడే చర్మం కోసం, స్కిన్ పై ముడతలు రాకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉండాలంటే దానిమ్మ పండ్లు తినాలని సూచిస్తున్నారు. విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధకాలతో రక్తపోటు, కీళ్లనొప్పులనూ కంట్రోల్ చేస్తుంది. సో ప్రతిరోజూ ఓ దానిమ్మ పండు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.