గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ని శుక్రవారం మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ప్రతినిధులు కలిశారు. ఈ మేరకు హెచ్ఆర్సీ 2021 – 22 వార్షిక నివేదికను హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత లు సీఎం కు అందజేశారు.
ఈ సందర్బంగా కమిషన్ సభ్యుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు రచించిన కంబాటింగ్ కరప్షన్ ఇన్ ఇండియా – రోల్ ఆఫ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తితో పాటు జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత, హెచ్ఆర్సీ సీఈవో, సెక్రటరీ ఎస్ వి. రమణమూర్తి, కమిషన్ అధికారులు బొగ్గరం తారక నరసింహ కుమార్, కే. రవికుమార్ లు సీఎంని కలిసిన వారిలో ఉన్నారు.