ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని ప్రజలకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం రోజున 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ ఏయే మండలాల్లో వడగాల్పులు ఉంటాయో లిస్ట్ రిలీజ్ చేశారు.
తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు:
అల్లూరి సీతారామరాజు జిల్లా: డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాలు
అనకాపల్లి జిల్లా: నాతవరం, నర్సీపట్నం
కాకినాడ జిల్లా: కోటనండూరు
పార్వతీపురం మన్యం జిల్లా: భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు మండలాలు
విజయనగరం జిల్లా: డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట, మండలాల్లో తీవ్రవగాల్పులు వీచే అవకాశం
జిల్లాల వారీగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు:
ఎన్టీఆర్ జిల్లాలో 16 మండలాలు, అనకాపల్లిలో 11 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 9 మండలాలు,విజయనగరం జిల్లాలో 8 మండలాలో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అలెర్ట్ గా ఉండాలని ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు అత్యవసం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని సూచించింది.