ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిసారి రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Technology |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 01:40 PM

కొంతకాలంగా వస్తున్న వార్తల్ని నిజం చేసింది వన్‌ప్లస్ ఇండియా. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ నుంచి రూ.20,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone Under Rs 20,000) వస్తుందని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


అందరూ ఊహించినట్టుగానే రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఇండియాలో వన్‌ప్లస్ మొబైల్ లాంఛ్ అయింది. రూ.19,999 ధరకు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ (OnePlus Nord CE 2 Lite 5G) మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఒకప్పుడు వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసేది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.35,000 పైనే ఉండేది. కానీ నార్డ్ సిరీస్ ద్వారా రూ.25,000 సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 మోడల్స్‌ని ఇప్పటికే ఇండియాలో రిలీజ్ చేసింది. ఇవన్నీ రూ.25,000 రేంజ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు రూ.20,000 లోపే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ రిలీజ్ చేసింది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ధర


 


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. బ్లాక్ డస్ట్, బ్లూ టైడ్ కలర్స్‌లో కొనొచ్చు. ఏప్రిల్ 30న సేల్ ప్రారంభం కానుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్, వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌ని కూడా రిలీజ్ చేసింది కంపెనీ.


 


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల పాపులర్ అయిన ప్రాసెసర్స్‌లో ఇది కూడా ఒకటి. ఇదే ప్రాసెసర్ లేటెస్ట్‌గా రిలీజైన పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. స్టోరేజ్ నుంచి 5జీ ర్యామ్ పెంచుకోవచ్చు.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఏఐ సీన్ ఎన్‌హ్యాన్స్‌మెంట్, స్లోమో, డ్యూయెల్ వ్యూ వీడియో, హెచ్‌డీఆర్, నైట్‌స్కేప్, పోర్ట్‌రైట్ మోడ్, పనో, రీటచింగ్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. ఫ్రంట్ కెమెరాలో స్క్రీన్ ఫ్లాష్, హెచ్‌డీఆర్, నైట్‌స్కేప్, పోర్ట్‌రైట్ మోడ్, రీటచింగ్, ఫిల్టర్స్ ఫీచర్స్ ఉన్నాయి.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్, ఎస్‌డీకార్డ్ సపోర్ట్, 3.5ఎంఎం జాక్, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్‌సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa