ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే!

national |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 05:47 PM

70 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలు రాశారు. ఆయన స్వయాన ఎమ్మెల్యే కూడా. చాలా మంది చదువును అనేక కారణాల వల్ల ఆపేసుంటారు. అలాంటి వారికి ఆ ఎమ్మెల్యే ఆదర్శమయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్​ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్ 70 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షలు రాసి వార్తల్లోకెక్కారు.

కంధమాల్ జిల్లాలోని ఫుల్బాని నియోజకవర్గ ఎమ్మెల్యేగా అంగాడ కన్హార్​(70) ఉన్నారు. 1978లోనే తన చదువును ఆపేయడంతో ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయినప్పటికీ తాను పదో తరగతి పూర్తి చేయాలని చాలా సార్లు అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైస్కూల్​ వార్షిక పరీక్షలకు శుక్రవారం హాజరయ్యారు. ఆయన పరీక్షకు హాజరైన పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com