ప్రధాని మోదీ అంటే చాలా మందికి ఇష్టం. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. చాలా మంది ఆయనలాగే గెడ్డం పెంచుకుని లేదంటే ఆయనలాగే వేషాధారణతో మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరికి చెందిన గౌడర హాలేశ్ కూడా మోదీపై తన అభిమానాన్ని చాటాడు.
ఆయన తన కూతురు కోసం కొత్తగా నిర్మించిన ఇంటికి 'శ్రీ నరేంద్ర మోదీ నిలయం' అని పేరు పెట్టుకున్నాడు. ఇంటి ముఖ ద్వారం వద్ద మోదీ ఫోటోను ఉంచి తన అభిమానాన్ని చాటుకున్నాడు. చన్నగిరిలోని కగటూరు రోడ్డులో నిర్మించిన ఈ ఇళ్లును చూడ్డానికి చుట్టుపక్కల ప్రజలు అక్కడికి క్యూ కడుతున్నారు. ఈ నూతన ఇంటికి గృహప్రవేశ కార్యక్రమాన్ని మే 3వ తేదిన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.