చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం రాజుపల్లె క్రాస్ వద్ద కర్ణాటక సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. శేషాచలం అడవుల నుంచి చౌడేపల్లె మీదుగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తుంటే 17 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కోలారు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ సచిన్ గోర్పోడి ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర పోలీసులు దాడులు నిర్వహించారు. దుంగల విలువ రూ. 45 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.