పాలకొండ: నగర పంచాయతీలోని ఇందిరానగర్ కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి భర్త మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశాడు. దీనిపై పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సీఐజి. శంకరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంది రానగర్ కాలనీలో దూసి లక్ష్మణరావు, సరోజినిలు నివాసం ఉంటున్నారు. లక్ష్మణరావు ఆటో నడు పుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి భార్య మృతి చెందింది. అది గమనించిన లక్ష్మణ రావు ఆమె మృతదేహాన్ని ఆటోలో తన సొంత గ్రామం మండలంలోని వెలగవాడకు తీసుకువెళ్లి శుక్రవారం ఉదయం క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. దీనిపై మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మణరావును అదుపులోకి తీసుకుని విచారణ చేసి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. లక్ష్మణరావుకు గతం లో పెళ్లి కాగా సరోజినిని ద్వితీయ వివాహం చేసు కున్నాడు. ఇదిలా ఉండగా గత ఏడాది లక్ష్మణరావు 18ఏళ్ల కుమార్తె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.