వేసవి సెలవులు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-తిరుపతి మధ్య సమ్మర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 30వ తేదీ నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30, మే 7, 14, 21, 28 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఈ రైలు (07509) సాయంత్రం 4. 35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 5. 30 గంటలకు తిరుపతికి చేరుతుందన్నారు.
అలాగే తిరుపతి నుంచి మరో రైలు (07510) మే 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 11. 50 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12. 30 గంటలకు హైదరాబాద్ చేరుతుందన్నారు. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుతుందన్నారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.