గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లో బహిరంగంగా ఒక యువకుడు నడి రోడ్డు మీద బీటెక్ విద్యార్థినిని హత్య చేసినట్లు సాక్షాత్తు సీసీ కెమెరాలలో కనిపించడం జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలైన రమ్యకి న్యాయం చెయ్యాలి అని ప్రజా సంఘాలు అలానే, ప్రతి పక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. సీఎం జగన్ ఈ విషయం మీద స్పందించి ఆ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం మరియు 10 లక్షల రూపాయలు ప్రభుత్వ తరుపు నుండి అందించడం జరిగింది. వీరిద్దరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఐనట్లు పోలీస్ శాఖ తెలియచేసారు. ఐతే ఈ కేసుకి సంబంధించి గుంటూరు లోని స్పెషల్ కోర్ట్ తుది తీర్పు ఈ రోజు ఇవ్వడం గమనార్హం. ఎన్నడూ లేని విధంగా ఇతనికి ఉరి శిక్ష విధిస్తున్నట్లు కోర్ట్ తీరు వెల్లడి చేసింది. ఈ సందర్భంగా ముద్దాయి తల్లి మాట్లాడుతూ... క్షణికావేశంలో చేసిన తప్పుకు మరణ శిక్ష సరికాదు. ఘటన జరిగిన రోజు నుంచి నా కుమారుడు ఏడుస్తూనే ఉన్నాడు. తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు. నా కుమారుడికి ఉరి శిక్ష వేస్తే రమ్య తిరిగి వస్తుందనుకుంటే ఆ శిక్ష వేయొచ్చు. కోర్టు తన నిర్ణయాన్ని పునరాలోచించాలి అని శశికృష్ణ తల్లి, భూలక్ష్మి ఆవేదన వ్యక్త పరిచారు.