వన్యప్రాణులు ఈమధ్యకాలంలో అరణ్యాలు వీడి జనవాసాలకు చేరుతున్నాయి. ప్రజలు సంచరించే ప్రదేశాలకు రావడమే కాకుండా జనం మీదకు వస్తున్నాయి. ఇళ్ళలో వుండే పెంపుడు జంతువులైన ఆవులు, మేకలు, గొర్రెల్ని హతమారుస్తున్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది. మహారాష్ట్ర లో కూరగాయల ట్రేలో దూరింది ఒక చిన్న చిరుత కూన. చంద్రపూర్ జిల్లాలోని మూల్ తాలూకా లోని ఉథడ్ పేట్ గ్రామ రైతు కిన్నకే అనే రైతు కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పొలంలో కూరగాయలు తెంపి ట్రే లో పోసే క్రమంలో పై కప్పి ఉంచిన గోతాన్ని తీశాడు. అప్పటికే అక్కడ చిరుతపులి పిల్ల వుంది. దానిని విషయం గ్రామస్తులకు తెలియజేయడంతో భారీగా జనం తరలివచ్చారు. ఆ చిరుత కూనను పరిశీలించారు. విషయం అటవీశాఖ అధికారులకు చేరవేయగా అక్కడికి వచ్చిన అధికారులకు చిరుతకూనను అప్పగించారు. చిరుత కూన కావడంతో ఎవరికీ హాని చేయలేదని రైతు తెలిపాడు.