జనసేన నాయకులూ పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేపట్టి , ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయాల చొప్పున, రాష్ట్రంలో ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకి మేలు చేస్తున్నప్పటికీ , పాలక వర్గం లో కొంతమంది ఆయనను చంద్రబాబు దత్త పుత్రుడు అని హేళనగా మాట్లాడిన సందర్భంలో, కొంతమంది జనసేన నాయకులూ కూడా ఎదురుదాడి చేసారు. ఇందులో భాగంగా తాజాగా పవన్ కళ్యాణ్ గారినీ, జనసేన పార్టీని విమర్శించడానికి జగన్ రెడ్డి గారు ప్రత్యేక శాఖ, కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని జనసేన PAC సభ్యులు శ్రీ పంతం నానాజీ గారు ఎద్దేవా చేశారు. మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకోవడం మాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసి సీబీఐ దత్తపుత్రుడి దగ్గర మార్కులు కొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa