కరోనా కేసుల దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్ మొదలైంది. ఈ తరుణంలో ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ప్రజలకు శుభవార్త చెప్పింది.
ఇకపై 12-17 ఏళ్ల లోపు వారికి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ కొవావ్యాక్స్ టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా కొవిడ్ టీకా ప్రికాషన్ డోసు, రెండో డోసు మధ్య విరామ సమయాన్ని తగ్గించే విషయం కూడా సమావేశంలో చర్చించారు. ఈ రెండు డోసుల మధ్య వ్యవధి 9 నెలలు ఉంది. అయితే దీనిని ఆరు నెలలకు తగ్గించే ఆలోచనలో అధికారులు చర్చలు జరిపారు.