ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో 44వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు రాత్రి 7:30గంటలకు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనుంది.లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఈ సీజన్లో వరుసగా 8వ ఓటమిని చవిచూసింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సీజన్‌లో తమ ఆరో విజయాన్ని నమోదు చేసి మంచి జోష్‌లో ఉంది.
ముంబై ఆడిన ఎనిమిది గేమ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ముంబై టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిరాశపర్చుతున్నారు. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో టాప్ ఆర్డర్ మంచి స్టాండింగ్ ఇవ్వలేదు. కాస్ట్‌లీ ప్లేయర్ ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతనికి బదులు.. తిలక్ వర్మతో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశముంది.
ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ కొద్దో గొప్పో బాగానే రాణిస్తున్న అది విజయానికి సరిపోవడం లేదు. ఇక నేడు జరగబోయే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొలార్డ్ తమ సత్తా మేరకు రాణించాల్సిన అవసరముంది. అయితే వీరిలో బ్రెవిస్, పొలార్డ్ తుది జట్టులో ఉండడం డౌటే.
బౌలింగ్ పరంగా.. డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్ లాంటి ప్లేయర్లు కొంత పొదుపుగా బౌలింగ్ చేస్తుండడం ముంబైకి కాస్త ఊరటనిస్తుంది. ఇక జస్ప్రీత్ బుమ్రా పేస్ దళాన్ని నడిపిస్తున్నాడు. కీరన్ పొలార్డ్ కూడా బానే బౌలింగ్ చేస్తున్నాడు. అయితే జయదేవ్ ఉనద్కత్ మాత్రం ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నాడు. రిలే మెరెడిత్ పర్వాలేదు.ముంబయి ఇండియన్స్ జట్టులో మార్పులు తథ్యమని తెలుస్తోంది. జయదేవ్ ఉనద్కత్‌ను తప్పిస్తారని తెలుస్తోంది. అతని స్థానంలో క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ రావచ్చు. అతను ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ముంబైపై ట్రోలింగ్ పెరిగింది.
దీంతో అతన్ని తుదిజట్టులోకి తీసుకునే వీలుంది. అలాగే టిమ్ డేవిడ్, ఫాబియన్ అలెన్ లాంటి విదేశీ ప్లేయర్లను తీసుకునేందుకు డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొలార్డ్‌లను తొలగించే అవకాశముంది. అయితే పొలార్డ్‌ను ముంబై తప్పిస్తుందా అనేది సందిగ్ధమే. ఇక రాజస్థాన్ రాయల్స్ సక్సెస్ ఫుల్ టీంగా కొనసాగుతుండడంతో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది.తుది జట్ల అంచనా