మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తనయుడు మహారాష్ట్ర టూరిజం, పర్యావరణ మంత్రి ఆదిత్య ఉద్దవ్ థాకరే శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.