కేటీఆర్ ఎవరో చెప్పిన మాటలు విని ఏపీపై కామెంట్ చేయడం సరైంది కాదు. కేటీఆర్ ఏపీకి వచ్చి పరిశీలిస్తే అభివృద్ధి కనిపిస్తుంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను చూడండి. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉంది. ఏపీ పథకాలను అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఐతే, ఈ మాటలు మాట్లాడిన తెలంగాణ మంత్రి కేటీఆర్ .. ఒక సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు బాధ కలిగించినట్టుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ గారితో నేను సోదర సమాన అనుబంధాన్ని ఆస్వాదిస్తాను. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమించాలని కోరుకుంటున్నానుఅని తాను సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.