ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి పవిత్రతను కాపాడండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 04:48 PM

అధికారం మాది కనుక తిరుపతి నగరంలో మా పార్టీ వారి బ్యానర్లు, హోర్డింగ్లు మాత్రమే ఉండాలి అనే ధోరణితో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఈ తీరును పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని హోర్డింగ్ లను మీరు వచ్చిన వెంటనే తొలగించడం జరిగిందని జనసేన నాయకులు కమిషనర్ తెలిపారు.


అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాలలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హోర్డింగ్లను తొలగించి తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం విలువలను కాపాడాలని నగర కమిషనర్ కి వినతి పత్రం అందజేసి మీడియాతో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి రెడ్డి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు మాట్లాడుతూ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వెంటనే తొలగించడం జరిగింది.


మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అని వారం రోజులు గడువు లోగా ఈ ఫ్లెక్సీలను తొలగించాలి, లేనిపక్షంలో మేమే నగరం లో వెలసిన ఫ్లెక్సీలను తొలగిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com