హైదరాబాద్లో కరెంట్ సరిగా ఉండదని, జనరేటర్ వేసుకొని ఉండి వచ్చానని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించిన నేపథ్యంలో 'తెలంగాణ స్టేట్ సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అఫ్ తెలంగాణ' స్పందించింది. ‘‘ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీరు కరెంట్ బిల్ క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంట్ సరఫరా చేస్తాం. 15 నెలలుగా బిల్ చెల్లించలేదు.’’ అంటూ బొత్సకు ట్విటర్ వేదికగా విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చింది.