ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ నెలలో ఈ స్థాయి ఎండలు ఉండడం 122 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే. 1973, 2010, 2016లో ఈ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాదిన 40 డిగ్రీలు, వాయువ్య భారత్లో 35.90 డిగ్రీలు, మధ్య భారత్లో 37.78 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ డైరెక్టర్ మృత్యుంజయ్ తెలిపారు.