ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అయితే పర్యాటక శాఖ వెబ్ పోర్టల్లో కచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పింది. రద్దీని నివారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజున గంగోత్రి, యమునోత్రి, మే 6న కేదార్నాథ్, మే 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి.