దేశవ్యాప్తంగా విద్యుత్ కొరతపై ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘మోదీజీ.. విద్యుత్ సంక్షోభంలో మీ వైఫల్యానికి ఎవరిని నిందిస్తారు? మాజీ PM నెహ్రూనా? రాష్ట్ర ప్రభుత్వాలనా? లేదా ప్రజలనేనా’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు. 2022 నాటికి దేశంలో 24 గంటల విద్యుత్‌ను అందుబాటులో ఉంచుతామంటూ 2015లో, బొగ్గు సంక్షోభంపై వార్తలు కనిపించడం లేదంటూ 2017లో మోదీ చేసిన ప్రసంగాల వీడియోను పోస్ట్ చేశారు.