తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ చోటుచేసుకుంది. ఆశపు కుమా రస్వామి అనే వ్యక్తి శ్రీనివాస్‌నగర్‌లో తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె జ్ఞానప్రసూన(20) ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువు తోంది. అయితే ఆమె ప్రతిరోజు కళాశాల నుంచి ఆలస్యంగా ఇంటికి రావడంతో తండ్రి మందలించాడు. దీంతో తండ్రి మళ్లీ మందలించడంతో మనస్థాపానికి గురయ్యింది.
తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తూ అర్ధ రాత్రి సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఉదయం తల్లిదండ్రులు లేచి చూసేసరికి పక్కనే ఉన్న కుమార్తె కనిపించలేదు. వెంటనే కిందకు వచ్చి చూడగా, గదిలో లైటు వేసి ఉంది. లోపలకి వెళ్లి చూడగా, జ్ఞానప్రసూన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించింది. వెంటనే ఇరుగుపొరుగువారికి తెలియటంతో పోలీసులకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.