వైసిపి పాలన లో మహిళలు బయటకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే తాడేపల్లి ప్యాలస్ లో ఎలా నిద్రపడుతుంది జగన్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు నారా లోకేష్. విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన జరిగినా స్పందించలేనంతగా ఏం వెలగబెడుతున్నారు? విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి సమీపంలో యువతిని అత్యాచారం చెయ్యడంతో పాటు గుర్తు పట్టలేనంతగా పెట్రోల్ పోసి తగలబెట్టారు మృగాళ్లు. ఎక్కడ గన్? ఎక్కడ జగన్? ఇప్పటికైనా మేల్కొని మహిళలకు రక్షణ కల్పించండి. యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వెధవల్ని నడి రోడ్డుపై ఉరి తీసి మహిళల భద్రతకి భరోసా ఇవ్వండి అని డిమాండ్ చేసారు .