పాముతో డ్యాన్స్ చేయించి చట్టాన్ని ఉల్లంఘించారన్న నేరం కింద కొందరు కట్టకట్టాల పాలయ్యారు. పెళ్లి వేడుకలో నాగిని డ్యాన్స్ వేసి కటకటాల పాలైన ఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ వివాహ వేడుక కోసం పాములు పట్టే వ్యక్తిని పిలిపించి, నాగిని డ్యాన్స్ చేయించారు. ఆ వ్యక్తి బుట్టలో పామును పెట్టుకుని నాగిని డ్యాన్స్ చేస్తుండగా.. మిగిలిన వాళ్లు చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీటిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పామును ఆడించిన వ్యక్తితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి తరలించారు. పామును అటవీశాఖ అధికారులకు అందించారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం పామును అలా ఆడించడం దాన్ని హింసించడం అవుతుంది. అంతేకాదు, ఆ పాము వల్ల జనాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది.