జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, ఆగస్టు నాటికి పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్ఓ ఎం. మోహన్‌దాస్ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పత్తికొండ, తుగ్గలి మండలాలకు చెందిన అధికారులతో ఆరిఓ సమావేశమై ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు, హౌసింగ్ డీఈ, ఏఈలు, లేఅవుట్ అధికారులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.