ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం కేసును బాపట్ల పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. విజయ్ కృష్ణ, నిఖిల్ అనే ఇద్దరు యువకులతో పాటు ఓ మైనర్ బాలుడిని అరెస్టు చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన దంపతులు అవనిగడ్డలో పనుల కోసం శనివారం అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్ లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేవు. దీంతో స్టేషన్ లోని బల్లల మీద పడుకున్నారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆ మహిళ భర్తపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతులు నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa