ఏపీలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. 18002749868, 08465-277705 నెంబర్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేస్తాయని ఇంటర్ బోర్డు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa