ఇసుక ను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను గుడ్లూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మల్లికార్జున మాట్లాడుతూ. గుడ్లూరు మండలం లోని పరకొండపాడు గ్రామం వద్ద గల మన్నేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఎస్సై మల్లికార్జున్ తమ సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి పరకొండపాడు గ్రామం వద్ద కాపు కాసి పట్టుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. అనంతరం డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఇసుక ను పోలీస్ స్టేషన్ కు తరలించామని చెప్పారు.