చిత్తూరు: కుప్పం పట్టణంలోని చెందిన 14వ వార్డులో నివాసం ఉంటున్న జయరాం ఆరోగ్య సమస్యలతో తమిళనాడు రాష్ట్రం ధర్మపురిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మునిసిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి స్పందించి వాలంటీర్లు శ్రీపతి, మన్సూర్ లను ధర్మపురిలోని ఆసుపత్రికి పంపించి పింఛను అందేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి పించన్ అందజేయడానికి కృషి చేసిన మునిస్వామిని ప్రజలు అభినందిస్తున్నారు.