పగలంతా ఉక్కపోత. రాత్రి అయితే కరెంటు కోతలు, దానికితోడు దోమల మొదలు వీటన్నిటితో వేసవిలో రాజాం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది. రాష్ట్రములో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రజలు ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లో ఏసీలు, ఇన్వర్టర్ లు ఉన్న వాళ్ళు కొంత ఉపశమనం పొందుతున్నా, పేద మధ్య తరగతి ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు తీస్తున్న కరెంటు కోతలతో రాత్రుళ్ళు నిద్ర లేక దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజాం పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఉదయం నుండి మండుటెండలు తో ఉక్కపోత కు గురి అయిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షానికి సేద తీరారు. ఆదివారం సాయంత్రం వరకూ గాలిలో తేమ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అనంతరం సాయంత్రం ఒక్కసారి మేఘాలు వేసి రాత్రి అయ్యేసరికి ఈదురుగాలులతో కూడిన వర్షం వాతావరణం ప్రజలకు సాంత్వన ఇచ్చినట్లయింది.