విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు ఇంజక్షన్ల విక్రయిస్తున్న ముఠా ను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ మేరకు పొగిరి శ్రీను, రవి కుమార్ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీరి నుంచి సుమారు 270 మత్తు ఇంజక్షన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 6 వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ లను 10 వేలకు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాల వినియోగం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ సూచించారు.