తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుల్లిపాడు- నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య యువకుడు మృతి చెందాడని జిఆర్పి పోలీసులు తెలిపారు. తుని వైపు నుండి నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళు రైల్వే ట్రాక్ పై మృతి చెందిపడిఉన్నాడు అన్నారు. మృతుడు చిట్టిమాని సత్తిబాబు(19) అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం గ్రామానికి చెందిన వ్యక్తి అన్నారు. మృతుడు నిన్న రాత్రి వేముపాడు గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి వారి పండగ జాతర సందర్భంగా తమ స్నేహితులతో కలసిజాతరలో మద్యం సేవించినాడని. తెల్లవారుజామున రైలు పట్టాలపై మృతి చెందిఉన్నాడు అన్నారు. ఈ సంఘటనపై నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.