సదరు నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో వారికే తెలియాలి. ఇదిలా ఉండగా సదరు నిర్మాణ దారుడు మూడు అంతస్తుల స్లాబ్ నిర్మాణం పనులు చేపట్టి అనంతరం గోడ కట్టే క్రమంలో సమీప ఇంటి గోడను ఆనుకొని స్లాబ్ వేయడంతో పాటుగా సమీప ఇంటి గోడ వినియోగించుకోవడం తో సదరు వ్యక్తి సచివాలయ సిబ్బందికి గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ఇంటి నిర్మాణం మొదటి దశలో ఉన్నప్పుడే సచివాలయ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. ఇంత వరకు బాగున్నా నోటీసులు జారీ చేసిన సచివాలయం సిబ్బంది పర్యవేక్షణ లోపంతో సదరు నిర్మాణం మూడో దశకు చేరుకుంది.
ఫిర్యాదుతో కోపగించుకున్న కార్పొరేటర్ భర్త ఇటీవలే నిర్మాణ దారుడికి సహకరిస్తూ ఫిర్యాదులపై దుర్భాషలాడిన ని ఫిర్యాదుదారుడు అంటున్నాడు ఈ విషయమై సచివాలయం సిబ్బందికి వివరణ కోరగా సదరు నిర్మాణంలో తాము జోక్యం చేసుకోలేమని ఆ నిర్మాణానికి సంబంధించి వార్డు కార్పొరేటర్ భర్త తమకు ఆ దేశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ నిర్మాణం సంబంధించి సమీప ఇంటి యజమాని సచివాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడు. అయినా సచివాలయం సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ విషయమే న్యాయపోరాటం చేస్తానని బాధితుడు అంటున్నాడు ఇదిలా ఉండగా సదరు నిర్మాణానికి సంబంధించి వరస ఫిర్యాదులు అందుతూ ఉండడంతో నిర్మాణ దారుడు నిర్మాణ వేగాన్ని పెంచారు. ఈ విషయమై సంబంధిత చైర్మన్ కు మూడు రోజులనుండి నేరుగా ఫోన్ ద్వారా సమాచారం అందించిన అటుగా చూడలేదని వాపోతున్నారు. నగరం నడిబొడ్డున ప్రధాన రహదారికి ఆనుకొని కంటికి కనిపించే విధంగా నిర్మాణం జరుగుతూ ఉంటే కనీసం జీవీఎంసీ అధికారులకు కనిపించలేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ జోన్ - 5 టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.