ఏపీలోని కృష్ణా జిల్లా పసుమర్రు జిల్లా పరిషత్ స్కూల్ లో మాస్ కాపీయింగ్ జరిగింది. టెన్త్ పరీక్షా కేంద్రానికి స్లిప్పులు పంపిన ఐదుగురు టీచర్లను విద్యాశాఖ గుర్తించింది. ఇద్దరు టీచర్ల సెల్ ఫోన్లలో పరీక్షా పత్రాల జవాబులను గుర్తించారు. మండవల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం వచ్చినట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. నలుగురు టీచర్లను సస్పెండ్ చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa