పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరుల జీవితాల్లో ఆ అల్లా సుఖశాంతులను నింపాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సత్య ప్రసాద్ కోరారు.