తన కేసును అమర్తలూరు ఎస్సై జాప్యం చేస్తున్నారని బాపట్ల జిల్లా, వేమురునియోజకవర్గం, మండల కేంద్రం అమృతలూరు కు చెందిన బాధితుడు జిల్లా ఎస్. పి, వకుల్ జిందాల్ కు పిర్యాదు చేసారు. తన బంగారం పోయిందని ఇచ్చిన కేసులో అమర్తలూరు ఎస్సై జాప్యం చేస్తున్నారని బాధితుడు తలకొండపాటి శ్రీనివాసరావు ఎస్పీ కి సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంను ఆశ్రయించారు.
ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో తన గృహం నందు 6 లక్షల విలువైన బంగారం అపహరణకు గురైందని, తన బంధువైన ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లు అమృతలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్. ఐ, అనుమానితుడిని విచారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ క్రమంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించి తన కేసు పట్ల తనకు న్యాయం చేస్తారని స్పందనలో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.