రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం రోడ్లు, తాగునీటి సరఫరాపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. అలానే చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పనిచేయాలన్న దిశా నిర్దేశం చేసారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్ ఛానెల్స్‌కి లింక్ చేయగలిగితే... నీటిఎద్దడిని నివారించగలుగుతామన్నారు. కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలి. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారు.