ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఉడా కాలనీలో ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఉపాధి కోసం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చింది. ఆమె ఓ టీ దుకాణంలో పనిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి దుండగుడు ఆమె ఇంటి తలుపుకొట్టాడు. తలుపు తీయగానే బలవంతంగా లోనికి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa